![]() |
![]() |
.webp)
ఇష్మార్ట్ జోడి నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక నెక్స్ట్ వీక్ కి ఎంటర్టైన్మెంట్ థీమ్ ఇచ్చారు. దాంతో ఒక్కో జోడి ఒక్కో గెటప్ లో వచ్చి ఇరగదీసారు. ఇక యాంకర్ ఓంకార్ లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగాడు.. "తేజు నీకు ఇన్విజిబుల్ పవర్ ఎం చేస్తావ్" అని అడిగాడు. వెంటనే అమర్ దీప్ మైక్ పట్టుకుని. "ప్రపంచకంలా ఆడోల్లకు ఇన్వి జిబుల్ పవర్ వస్తే అందరూ మొగుళ్ళ చుట్టే తిరుగుతారు. బాత్రూంకి పోయినా, కారెక్కిన వెనకాలే ఉంటది..షాపింగ్ పోయినా, వేరే అమ్మాయితో చిన్న కాఫీ మీటింగ్ కి పోయినా వెనకాలే ఉంటది. ఇడిసిపెట్టి యాడికి పోతాది సిన్న జోరీగ లెక్క చెవి కాడినే తిరగతా ఉంటాది. మొగుళ్లే ఊళ్లు పట్టి తిరగతారు.
ఎవురూ సెప్పలేరు..నేను కాబట్టి సెప్పినా...పెళ్ళాం మాట మొగుడింటే ఎల్లా ఉంటదో ఈ ప్రెపంచకానికి చూపిస్తా" అన్నాడు అమరదీప్ చౌదరి. ఐతే ఇష్మార్ట్ జోడి స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో చూసుకుంటే అమర్ - తేజు మధ్య వాళ్ళ మ్యారీడ్ లైఫ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయన్న విషయం చెప్పారు. ఐతే వాటిని పరిష్కరించుకుంటూ వస్తున్నామని అలాగే ప్రేమతో ఉండడానికి ప్రయతిస్తున్నామని చెప్పారు. ఇక తేజో కూడా అంత తొందరగా ఎవరినీ నమ్మొద్దు అంటూ కూడా సలహా ఇచ్చింది. ఇక అమర్ తేజు కోసం ఒక ప్రేమలేఖ కూడా రాసి మెప్పించాడు. ఇలా వీళ్ళు ఈ షో ద్వారా కొంతవరకు వాళ్ళ సమస్యలను తీర్చుకున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.
![]() |
![]() |